రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన… కార్యకర్తల్లో ఫుల్ జోష్

పీసీసీ అయినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా  నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి చింతమల్ల ప్రీతి తండ్రి దశరథకు ఫోన్ లో పరామర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జరిగిన దారుణంపై ఈ ఘటనతో సంబంధమున్న ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్షపడేలా చేస్తామని ఈ సందర్భంగా చెప్పిన రేవంత్‌..రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు ఉన్న నేపథ్యంలో జరిగిన దారుణంపై కేంద్ర హోం శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుండి బాధిత కుటుంబానికి అట్రాసిటీ క్రింద నష్టపరిహారం అందేలా మాట్లాడతా హామీ ఇచ్చారు రేవంత్‌. వికలాంగుడైన దశరథకు పెన్షన్ ఇప్పటిదాకా ఎందుకు రావట్లేదని…. జిల్లా కలెక్టర్ తోటి మాట్లాడి పింఛన్ వచ్చేలా చేస్తాననని తెలిపారు.

అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నుండి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటానని…కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. రేవంత్‌ ప్రకటనతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.