తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టైల్ డిఫరెంట్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… వార్తల్లో నిలుస్తారు జగ్గారెడ్డి. అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. నిన్నటి నుంచి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.
పార్టీ నుంచి బయటకు వెళ్లి పార్టీ పెడతానని చెబుతున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదని దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
జగ్గారెడ్డి విషయం టి కప్పులో తుఫాన్ లాంటిదని.. ఇది అంతర్గత సమస్య అన్నారు. అది మాకు మేము పరిష్కరించుకుంటామని.. ఇది చాలా చిన్న విషయమని… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.టీ కప్పులో తుఫాన్ అంటే రాజీనామా చేయాలనే ఉద్దేశమని అటు రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీనియర్ల తో మాట్లాడతానని.. Mlc ఎన్నికల్లో రేవంత్, ఉత్తమ్ ఎందుకు అభ్యర్ధులను పెట్టలేదని వారిపై మండిపడ్డారు.