హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న రేవంత్​ రెడ్డి…

-

టీపీసీసీ కి నూతన సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కి రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతోంది. నిన్న, మొన్నటి దాకా పార్టీ సీనియర్ నేత సహచర ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​ రెడ్డి రేవంత్​ రెడ్డి నాయకత్వాన్ని బహిరంగానే విమర్శించారు. ఆయన కాస్త సైలెంట్​ అయ్యారో లేదో రేవంత్​ కు మరో చిక్కు వచ్చిపడింది. అసలు విషయం ఏంటంటే.. కాంగ్రెస్​ పార్టీ ఆగస్టు తొమ్మిదో తేదీన ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా దళిత దండోరా అనే సభ నిర్వహించాలని ప్లాన్​ చేసింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అందుకు ఏర్పాట్లలో భాగంగా సభ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్​ సీనియర్​ నేత కొక్కిరాల ప్రేమ్​ సాగర్​ రావుకు అప్పగించారు. దీంతో ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్​ ఏలేటి మహేశ్వర్​ రెడ్డి అలక బూనారు. తన పార్లమెంటు పరిధిలో తనకు తెలియకుండా దళిత దండోరా సభ ఎలా నిర్వహిస్తారని ఆయన పార్టీ అధినేత రేవంత్​ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు.

కొన్ని రోజుల కిందట ఆయన శ్రీలంక పర్యటనకు వెళ్లారు. దీంతో ఎలాగా అని తల పట్టుకుంటున్న రేవంత్​ రెడ్డికి ఏ ఉపాయం తోచలేదు. ఆయన శ్రీలంక నుంచి వచ్చిన తరువాత పార్టీ సీనియర్​ నేతలు జానారెడ్డి, షబ్బీర్​ అలీ వెళ్లి మహేశ్వర్​ రెడ్డిని సముదాయించారు. దీంతో కాస్త తగ్గిన మహేశ్వర్ రెడ్డి ఇంద్రవెల్లి సభ బాధ్యతను ఆదిలాబాద్​ డీసీసీ అధ్యక్షుడు సాజిద్​ ఖాన్​ కు అప్పగించాలని డిమాండ్​ చేయగా.. అందుకు సరేనంటూ జానారెడ్డి, షబ్బీర్​ అలీ ఒప్పుకున్నారు. దీంతో ఇంద్రవెల్లి సభ బాధ్యతల నుంచి కొక్కిరాల ప్రేమ్​ సాగర్​ రావును తొలగించి నూతనంగా ఆదిలాబాద్​ డీసీసీ అధ్యక్షుడు సాజిద్​ ఖాన్​ కు బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news