రైతుబీమాకు 4 రోజులే గడువు.. దరఖాస్తు చేయండిలా…!

-

హైదరాబాద్: తెలంగాణలో రైతుబీమా పథకం దరఖాస్తుకు మరో అవకాశం కల్పించారు. మరో నాలుగు రోజులు పాటు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించిన విషయం తెలిసిందే. అయితే రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఈ నెల 3లోపు రైతుబీమాకు రిజిస్ట్రర్ చేసుకున్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

అయితే ఈ దరఖాస్తుకు 18 ఏళ్ల నుంచి 59 వయసు కలిగిన రైతులే అర్హులు. 1962 8వ నెల 14వ తేదీ నుంచి 14.08.2003 మధ్య జన్మించి ఉండాలి. వయసు ధృవీకరణ కోసం అధార్ కార్డు తీసుకుంటారు ఊరిలో ఉన్న భూములకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. వేరే చోట ఉంటే స్వీకరించరు. రైతే స్వయంగా వెళ్లి నామినేషన్ ఇవ్వాలి. భూమికి సంబంధించిన పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ లు తప్పనిసరిగా సమర్పించాలి. ఈ సంవత్సరం బీమాకు దరఖాస్తు చేసుకోకపోతే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. కావున త్వరగా దరఖాస్తులు సమర్పించండి.

 

ఇక ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 800 కోట్లు కేటాయించింది. 2021-22కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. రైతుల తరపు చెల్లించాల్సిన ప్రీమియం గడువు ఈ నెల 13తో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం అమల్లోకి వస్తుంది. రైతులపై భారం పడకుండా ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతుకు అనుకోని ఘటన జరిగితే ఆ కుటుంబానికి రూ 5 లక్షలు చెల్లిస్తారు. గత ఏడాది 32 లక్షల 73 వేల మందికి సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి రైతుపై రూ. 3486 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news