సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది హైకోర్టు. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.
రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.
అయితే, ఈ విషయంపై రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
సీఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని మేం మొదటి నుండి చెబుతున్నాం. తాజాగా హైకోర్టు అదే చెప్పింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ధరణి, సీసీఎల్ఎ, రెరాకు హెడ్ గా సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలి. pic.twitter.com/6VtMSXUWUk
— Revanth Reddy (@revanth_anumula) January 10, 2023