చలో ఖమ్మం: రేవంత్ రెడ్డి ఫోటో లేకుండా చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి… 

-

రేపు ఖమ్మంలో ప్రజాగర్జన సభకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా రానున్నారు. ఇందుకోసం తెలంగాణ కీలక నేతలు ఈ సభను సక్సెస్ చేయడానికి తమవంతుగా వివిధ పనులలో నిమగ్నం అయి ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేయించిన పోస్టర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కలకలాన్ని రేపుతోంది. తెలంగాణ జన గర్జన సభ అనే టైటిల్ తో వేసిన ఈ పోస్టర్ లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి , రాహుల్ గాంధీ , భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జూపల్లి కృష్ణరావు లు మాత్రమే ఉన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఫోటో మాత్రం ఈ పోస్టర్ లో లేదు. దీనిని బట్టి రేవంత్ రెడ్డికి మరియు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి మధ్యన ఇంకా విభేదాలు అలానే ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ఈ విషయాన్నీ అధిష్ఠానము సీరియస్ గా తీసుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news