వైరాలో కారు వర్సెస్ కాంగ్రెస్..కమ్యూనిస్టులే డిసైడింగ్.!

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం..కాస్త ప్రత్యేకమైన నియోజకవర్గం…ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఒకే పార్టీని ఆదరించారు…ఒకే అభ్యర్ధిని ఆదరించారు. ఎన్నిక ఎన్నికకు ఫలితం మార్చేస్తారు. గత మూడు ఎన్నికలుగా అదే చేశారు..దీంతో ఈ సారి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగగా, 2008లో వైరా ఏర్పడింది.

2009లో ఎన్నికలు జరగగా, సి‌పి‌ఐ నుంచి బానొత్ చంద్రావతి గెలిచారు. అప్పుడు సి‌పి‌ఐకి టి‌డి‌పి, బి‌ఆర్‌ఎస్ మద్ధతు ఇచ్చాయి. ఇక 2014లో సీన్ మారింది. అప్పుడు వైసీపీ నుంచి బానొత్ మదన లాల్ గెలిచారు. టి‌డి‌పి నుంచి పోటీ చేసిన బానొత్ బాలాజి రెండోస్థానంలో నిలవగా, కాంగ్రెస్ మద్ధతుతో సి‌పి‌ఐ నుంచి పోటీ చేసిన నారాయణ మూడో స్థానంలో, బి‌ఆర్‌ఎస్ నుంచి చంద్రావతి పోటీ చేసి నాల్గవ స్థానంలో నిలిచారు.

ఇక 2018 ఎన్నికల్లో పరిస్తితి మరింత గా మారింది. వైసీపీ నుంచి గెలిచిన మదన్ లాల్ బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళి పోటీ చేశారు. అటు కాంగ్రెస్-టి‌డి‌పి పొత్తులో సి‌పి‌ఐ నుంచి బానొత్ విజయ పోటీ చేశారు. సి‌పి‌ఎం పొత్తులో ఉండి కూడా బరిలో దిగింది. కానీ వీరు ఎవరు గెలవలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన లవ్యూడ రాములు గెలిచారు. వైరా లో కాంగ్రెస్ శ్రేణులు సి‌పి‌ఐకి మద్దతు ఇవ్వకుండా రాములుకు సపోర్ట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు.

ఎమ్మెల్యేగా గెలిచాక రాములు బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేయనున్నారు. కానీ ఆయనకు అంత పాజిటివ్ లేదు. ఇటు కాంగ్రెస్ నుంచి నలుగురు రేసులో ఉన్నారు..పొంగులేటి వర్గం నుంచి బానొత్ విజయ్ బాబు, రేణుకా చౌదరీ వర్గం నుంచి ధరావత్ రామ్మూర్తి, భట్టి వర్గం నుంచి మాలోత్ రాందాస్ నాయక్, బానొత్ బాలాజి వైరా రేసులో ఉన్నారు.

అయితే బి‌ఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టులకు మద్ధతు ఉంటే ప్లస్ అవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతల్లో ఎవరికి సీటు ఇచ్చిన అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే గెలుస్తారు. చూడాలి వైరాలో ఈ సారి పైచేయి ఎవరిదో.

Read more RELATED
Recommended to you

Latest news