మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలం: రేవంత్‌రెడ్డి

-

హైదరాబాద్ అంబర్​పేట్​లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా ఫైర్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమవుతోందంటూ తీవ్రంగా మండిపడ్డాయి. తాజాగా ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.

మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి అన్నారు. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
కుక్కలు ఆకలితో ఉన్నాయని మేయర్‌ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు.

‘బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పారు. మనుషుల పట్ల కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇది. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు ఆక్రమించుకున్నారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదు.’ అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news