రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..కేసీఆర్ ఫామ్ హౌజ్ గ్రామంలో రచ్చ బండ

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇవాళ్టి నుండి రచ్చ బండ చేపడతామ‌ని.. అన్ని జిల్లాలలో రైతుల దగ్గరికి వెళ్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కొట్లాడుతామ‌ని.. కానీ రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఈ నెల 27 న సీఎం ఫార్మ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చ బండ నిర్వ‌హిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న చేశారు. వడ్లు కొనని సర్కార్ వద్దని మండిప‌డ్డారు.

revanth-reddy-cm-kcr

తెలంగాణ రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారం బియ్యమే ఇవ్వలేదని కేంద్రం చెప్తుందని… చుక్క,ముక్క కోస‌మే..తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారని రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ ఎస్‌ ఎంపిలు ప్రజలను మోసం చేశారని.. ఢిల్లీలో కాదు..గల్లీలో తెలుస్తామని వచ్చారన్నారు మండిప‌డ్డారు. బీజేపీకి చావు డప్పు కొడతామ‌ని చెప్పి… కేటీఆర్, కవిత, కెసిఆర్..సంతోష్ లు ఎందుకు పాల్గొనలేదని ఆగ్ర‌హించారు. బీజేపీ తో ఒప్పందం లో భాగంగానే చావు డ‌ప్పులో పాల్గొనలేదని.. మండిప‌డ్డారు.