ఓమిక్రాన్ పై ఆ రాష్ట్రం కీలక నిర్ణయం… క్రిస్మన్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.

-

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దేశంలో కేసుల సంఖ్య 350ని దాటింది. ఇప్పటికే ఓమిక్రాన్ పై కేంద్రం రాష్ట్రాలకు, కేంద్ర పాలితప్రాంతాలకు అలెర్ట్ జారీచేసింది. వచ్చే ఫెస్టివల్ సీజన్ లో ఎక్కువ మంది గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని.. వ్యాక్సినేషన్ వేగవంత చేయాలని… కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు నైట్ కర్ప్యూలను విధించాయి. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు న్యూ ఇయర్ , క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించాయి.

ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం కూడా న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై ఆంక్షలు విధించింది. క్రిస్మస్ వేడుకల్లో జనాలు గుమికూడకుండా ఉండేందుకు చర్చిల్లో 50 మంది పాల్గొనాలని ఆదేశించింది. న్యూ ఇయర్ సెలబ్రెషన్లను నిషేధించింది. హోటళ్లు, క్లబ్బులు , రెస్టారెంట్లు, పార్కుల్లో న్యూ ఇయర్ వేడుకను నిషేధించింది. దహన సంస్కారాలు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ర్యాలీలు, సోషల్ గ్యాదరింగ్ లను నిషేధించింది ఒడిశా సర్కార్.

Read more RELATED
Recommended to you

Latest news