అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు : ఆర్జీవీ కౌంటర్

-

మంత్రి పేర్ని నానికి ట్విట్టర్‌ ద్వారా రాంగోపాల్‌ వర్మ ప్రశ్నల వర్షం కురిపంచారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ.. ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని కోరారు. మీకు అధికారం ఇచ్చింది.. మా తలపై కూర్చోడానికి కాదంటూ ఘాటు వ్యాక్యలు కూడా చేశారు ఆర్జీవీ. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంలో ప్రభుత్వ పాత్ర ఎంత? హీరోల రెమ్యూనరేషన్‌ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు, రాబడిపైనే ఉంటుందన్నారు ఆర్జీవీ.

ఖర్చు, రాబడి విషయాన్ని ఏపీ మంత్రుల బృందం అర్థం చేసుకోవాలని.. నిత్యావసరాల కొరత ఉన్నప్పుడు ప్రభుత్వ జోక్యం అర్థంచేసుకున్నానని పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యంతో సమతుల్యత కంటే దిగువన లేదా ఎక్కువ ధర నిర్ణయిస్తారని.. అదే రీతిలో సినిమాలకు ఎలా వర్తింపజేస్తారు? అని పేర్కొన్నారు రాంగోపాల్‌వర్మ.

ఆహార ధాన్యాల్లోనూ బలవంతంగా ధర తగ్గిస్తే రైతులు ప్రోత్సాహాన్ని కోల్పోతారని.. ప్రోత్సాహం కోల్పోతే నాణ్యత లోపాన్ని సృష్టిస్తుందన్నారు. అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుందని… ఆర్జీవీ
పేదలకు సినిమా చాలా అవసరమని మీకు అనిపిస్తే రాయితీ ఇవ్వొచ్చు కదా? అని తెలిపారు. ప్రభుత్వం కొన్ని టిక్కెట్లు కొని పేదలకు తక్కువ ధరకు అమ్మవచ్చు కదా అని ప్రశ్నించారు ఆర్జీవీ.

Read more RELATED
Recommended to you

Latest news