బాలీవుడ్‌లో మరో విషాదం.. ‘షోలే’ నటుడు మృతి..!

-

బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ జగ్దీప్ 81 సంవత్సరాల వయస్సులో బుధవారం రాత్రి 8.40 నిమిషాలకు తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో సూర్మా భూపాలీ పాత్ర జగ్దీప్ నట జీవితంలో ఓ మైలురాయి. ఆయన నటించిన పాత్రలు దాదాపుగా హాస్య ప్రధానమైనవే కావడం విశేషం. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్దీప్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా 1970, 80లలో ఆయనలేని బాలీవుడ్ సినిమాలు లేవు. షోలే సినిమాలో ఆయన వేసిన సూర్మా భూపాలి క్యారెక్టర్ ఎంతో ఫేమస్.

1988లో ఆయన ‘సూర్మా భూపాలి’ పేరుతో ఓ సినిమాను డైరెక్ట్ చేసారు. ఈ చిత్రంలో ఆయన త్రిపుల్ రోల్ పోషించాడు. ఆ తర్వాత ఈయన సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ హీరోలుగా నటించిన ‘అందాజ్ ఆప్నా అప్నా’ సినిమాలో సల్మాన్ తండ్రి పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఈయన బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఆయన అసలు పేరు సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ. ఆయన తండ్రి జావేద్ జాఫేరి కూడా ఒక బాలీవుడ్ నటుడు అలాగే టీవీ డైరెక్టర్ నవేద్ జాఫ్రీ. కాగా, ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news