బీహార్ ఎన్డీయేలో పొడచూపిన విభేదాలు

-

బీహార్ రాష్ట్రంలో కొలువై ఉన్న ఎన్డీయే ప్రభుత్వం లో గత కొంత కాలంగా భేదాభిప్రాయాలు వస్తూనే ఉన్నాయి. సంకీర్ణం లో ప్రధాన భాగస్వామ్యం కలిగిన జేడీయూ , బీజేపీ ల మధ్య రానురాను సఖ్యత తగ్గుతుంది.

 

తాజా వివాదానికి కారణం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి , జేడీయూ నాయకుడు నితీశ్ కుమార్ , శాసనసభ స్పీకర్, బీజేపీ నాయకుడు విజయ్ కుమార్ సిన్హా ల మధ్య ఏర్పడిన చిన్న వివాదం ఈ రెండు పార్టీల మధ్య గొడవకు ఆజ్యం పోసింది.

ముంగేర్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన కారణంగా అందులో భాగమైన వారిని పోలీసులు అరెస్టు చేయగా వారిని విడిపించేందుకు స్పీకర్ డీజీపీ మీద ఒత్తిడి తీసుకొనిరావడం ముఖ్యమంత్రి నితీశ్ ను తీవ్ర అసహనానికి గురి చేసింది.

 

పై సంఘటన మాత్రమే కాకుండా 2020లో ఎన్డీయే సంకీర్ణ  ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ రెండు పార్టీల మధ్య ఏదొక విషయం మీద వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ అగథాన్ని ద్వారా ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news