IPL 2022 : గ్రౌండ్‌ లో రచ్చ చేసిన రిషభ్ పంత్ పిల్ల

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో ఓ మిస్టరీ గర్ల్‌ తళక్కుమంది. అందానికే అసూయపుట్టేలా ఉన్న ఆ బ్యూటీని టీవీ కెమెరాలు పదే పదే చూపించాయి.

ఆ బ్యూటీ అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఈ అందాల భామ ఎవరా అని ఆరా తీయగా.. రిషభ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ ఇషా నేగి అని తెలిసింది. దీంతో ఈ అమ్మడు ఫోటోలను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. ఇషా నేగితో గత కొంత కాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న రిషభ్‌ పంత్‌.. ఈ విషయాన్ని అతనే ఇన్‌ స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశాడు.

ఇషా నేగితో చనువుగా దిగిన ఓ ఫోటోలను షేర్‌ చేసిన రిషబ్‌ .. నిన్ను నేనేప్పుడూ హ్యాపీగా ఉంచాలను కుంటున్నాను. ఎందుకంటే.. నేను హ్యాపీగాఉండటానికి నువ్వే కారణంగా అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో వీరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు అర్థమైంది. ఇక.. ఈ బ్యూటీ నిన్న జరిగిన మ్యాచ్‌ లో ప్రత్యక్షమై.. పంత్‌ కు సపోర్టు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news