ఈమధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలి. ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా మంచి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. ఎక్కువగా యువతుల్లో గుండె సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి.
అటువంటి గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులని తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు తాజాగా చేసిన స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గుండె సమస్యలు 50 శాతం మహిళలని ఎఫెక్ట్ చేస్తుందని అందులో 25% మంది చనిపోతున్నారు అని చెప్పింది.
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం భారతీయులు చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. అయితే ఎందుకు యువతలో ఈ సమస్య బాగా పెరిగింది దానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సరైన ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోకపోవడం, కాంట్రాసెప్టివ్ పిల్స్, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ మొదలైన కారణాల వలన ఈ సమస్య వస్తుంది. హార్మోన్లలో మార్పులు జెనెటిక్స్ వలన కూడా ఈ సమస్య కలుగుతుంది.
హార్ట్ ఎటాక్ రిస్క్ ఎందుకు మహిళల్లో పెరిగింది..?
ముఖ్యంగా యంగ్ గా ఉండే మహిళల్లో ఈ సమస్య విపరీతంగా పెరిగింది. కాంట్రాసెప్టివ్ పిల్స్ ని వాడే మహిళల్లో హార్ట్ ఎటాక్ సమస్య ఎక్కువగా ఉంటుందని స్టడీ చెప్తోంది. ఈ పిల్స్ ని ఉపయోగించే మహిళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉంటాయి ఈ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుందని స్టడీ అంది. స్మోకింగ్ వలన కూడా ఈ సమస్య వస్తుంది. 35 నుండి 39 ఏళ్ల వారిలో స్మోకింగ్ కారణంగా ఈ సమస్య వస్తుందని తెలుస్తోంది. స్మోకింగ్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచేసింది. కార్డియో వాస్కులర్ సమస్యలకి దారితీస్తుంది.
చివరగా..
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి డైట్ విషయంలో తప్పులు చేయకూడదు. ధూమపానం చేయకూడదు ఇలా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.