జబర్దస్త్ కమెడియన్ కి షాక్ ఇచ్చిన రీతూ చౌదరి.. త్వరలో వివాహం..ఫోటో వైరల్..!!

-

ఇటీవల కాలంలో అటు సినీ సెలబ్రిటీలు అలాగే బుల్లితెర సెలబ్రిటీలు కూడా వివాహం చేసుకుంటూ ఒక ఇంటి వారు అవుతున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న రీతూ చౌదరి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతోంది. బుల్లితెరపై పలు టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె మొదట స్టార్ మా మ్యూజిక్ ఛానల్లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు ప్రోగ్రాం లో కూడా పాల్గొనింది. ఇకపోతే ఈ ప్రోగ్రాం తర్వాత గోరింటాకు సీరియల్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రీతూ చౌదరి ఆ తర్వాత వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారిపోయింది. మౌనమే ఇష్టం అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆ తర్వాత బుల్లితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మ కోసం వంటి సీరియల్స్ లో కూడా కీలక పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. అప్పుడప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కామెడీ షోలలో స్కిట్స్ చేస్తూ లేడీ కమెడియన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక మరొక జబర్దస్త్ కమెడియన్ పరదేశి తో ప్రేమ అంటూ ఈమె చేసిన కొన్ని స్కిట్లు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఈమె సీరియల్ యాక్టర్ అయినప్పటికీ తన గ్లామర్ షో తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తూ కుర్ర కారు గుండెల్లో మంట పెడుతూ ఉంటుంది.

ఇకపోతే బోల్డ్ ఫోటోషూట్స్ తో ఫాన్స్ కి నిద్ర లేకుండా చేసే ఈమె తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు అందుకు సంబంధించిన ఫోటో షేర్ చేసి పోస్ట్ చేసింది. తమ బంధం కంటే ఏది బెటర్ కాదని క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజన్స్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

https://www.instagram.com/p/CgCQHU1pURN/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news