ఇండో-చైనా సరిహద్దులో ఏం జరుగుతుందో అంచనా వేయలేం : ఆర్మీ చీఫ్

-

ఇండియా-చైనా సరిహద్దుల వెంట పరిస్థితులను అంచనా వేయలేమని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. బార్డర్ లో పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నా.. ఇప్పుడే ఏం చేయలేమని చెప్పారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన సంఖ్యలో బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

ఆర్మీ డేకు ముందు మీడియా సమావేశం నిర్వహించిన మనోజ్‌ పాండే.. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి దుశ్చర్యనైనా సమర్థంగా ఎదుర్కొనే సత్తా మన సైన్యానికి ఉందని జనరల్ పాండే అన్నారు. ఇరుదేశాల సైన్యాలు ఏడు అంశాల్లో ఐదింటిని చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సైనిక, రాయబార స్థాయిలో చర్చలు కొనసాగుతాయని జనరల్‌ మనోజ్‌పాండే స్పష్టం చేశారు.

జమ్ము కశ్మీర్‌లో 2021 ఫిబ్రవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బాగానే అమలవుతున్నా.. ఉగ్రవాదం, ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలకు సీమాంతర మద్దతు కొనసాగుతున్నట్లు జనరల్‌ మనోజ్‌పాండే ఆరోపించారు. ఆర్టిలరీ యూనిట్లలో మహిళా సైనికులకు చోటు కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news