వెస్టిండీస్ వన్డే సిరీస్ వైట్ వాష్ చేసిన టీమిండియా తొలి కెప్టెన్ గా హిట్ మాన్ రికార్డు సృష్టించాడు. 2017 సంవత్సరంలో టీమిండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారిగా శ్రీలంక వన్డే సిరీస్ వైట్వాష్ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు. అయితే వన్డే సిరీస్ను వైట్ వాష్ చేసిన టీమిండియా కెప్టెన్గా జాబితాలో హిట్మ్యాన్ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్, వెంగ్ సర్కార్, అజారుద్దీన్, గంభీర్, ధోని అలాగే కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించింది.
రోహిత్ శర్మ ఇప్పటివరకు 13 వన్డేలకు కెప్టెన్సీ గా ఉన్నాడు. ఇందులో 13 మ్యాచ్లు గెలిపించాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ తొలి 13 వన్డేల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించాడు. అయితే ఆ రికార్డును కూడా రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. కాగా చిట్టచివరి మ్యాచ్ అయిన మూడో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ ప్రదర్శనతో 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ వన్డే సిరీస్ లో వెస్టిండీస్ క్లీన్ స్వీప్ అయింది.
దీంతో దాదాపు 12 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై ఒక జట్టు క్లీన్ స్వీప్ అయింది. వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే లో తొలత బ్యాటింగ్ చేసిన 265 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్లు.. శ్రేయస్ అయ్యార్ (80), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (56) రాణించారు. అలాగే వెస్టిండీస్ బౌలర్ హొల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. ఇక ఛేజింగ్ కు దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లోనే ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ ఇండియా వశం అయింది.