కేసీఆర్ చెల్లని రూపాయి..ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరు : బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జనగామ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెల్లని రూపాయని.. ఢిల్లీలో ఎవరూ పట్టించుకోరని ఎద్దవా ఛేశారు బండి సంజయ్. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కథలు చెబుతాడా ? సోయి లేకుండా మాట్లాడే కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మరని ఫైర్ అయ్యారు.

సిఎం కేసీఆర్ అవినీతి సామ్రాజ్యం కూలిపోతుంది.. అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నాడని నిప్పులు చెరిగారు బండి సంజయ్.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ అంటే భయపడిపోతున్నారు అని మండిపడ్డారు. పిడికెడు బిజెపి ఉందన్న కేసీఆర్ ఎందుకు అలా భయపడుతున్నాడు అని ఎద్దేవా చేశారు. త్వరలోనే జనగామ జిల్లాలోని బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు.

బహిరంగ సభ కోసం డబ్బులు పని చేయాలి కానీ తమ బహిరంగ సభ కోసం కార్యకర్తలు.. సొంతంగా వస్తారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమని మండిపడ్డారు బండి సంజయ్ కుమార్. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన భాషను మార్చు కోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news