Rohith Sharma : టీ20 క్రికెట్‌ లో చరిత్ర సృష్టించిన రోహిత్‌

-

లక్నో వేదికగా శ్రీలంక తో జరుగుతున్న ఫస్ట్‌ టీ 20 లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ… చరిత్ర సృష్టించాడు. టీ 20 ల్లో నయా కింగ్‌ గా అవతరించాడు రోహిత్‌. వరల్డ్‌ రికార్డు బద్దలు కొట్టాడు ఈ హిట్‌ మ్యాన్. ఫస్ట్‌ టీ 20 లో 32 బంతుల్లో 44 పరుగులు చేసి.. లహిరు కుమారా బౌలింగ్‌ లో ఔటయ్యాడు.

అయితే.. తన వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద.. టీ 20 ఫార్మాట్లో.. అత్యధిక పరుగులు చేసిన.. ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్‌ శర్మ. ప్రస్తుతం రోహిత్‌ శర్మ.. 3307 పరుగులతో.. మొదటి స్థానంలో నిలిచాడు.

న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ 3299 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 329 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ సిరీస్‌ లో మరో 19 పరుగులు చేయడం ద్వారా రోహిత్‌ కెప్టెన్‌ గా టీ 20 క్రికెట్‌ లో 1000 పరుగులు పూర్తి చేయగలడు. దీంతో.. ఈ ఘటన సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించబోతున్నాడు రోహిత్‌ శర్మ.

Read more RELATED
Recommended to you

Latest news