బాల‌కృష్ణ మాస్ లుక్ లో రోహిత్ శ‌ర్మ‌.. ఫోటో వైర‌ల్

-

బాల‌య్య హీరోగా డైరెక్ట‌ర్ గోపిచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా వ‌స్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు ఎన్‌బీకే107 అనే వ‌ర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి హీరో బాల‌య్య ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే విడుద‌ల అయింది. మాస్ లుక్ లో బాల‌య్య‌.. అదిరిపోయాడు. ఈ లుక్ ను చూసి మాస్ క బాప్ అంటూ కామెంట్స్ కూడా వ‌చ్చాయి. ఇదీల ఉండ‌గా.. టీ20 సిరీస్ కోసం శ్రీ‌లంక.. భార‌త్ కు వ‌చ్చింది. నేడు మొద‌టి టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టికే వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శ‌ర్మ సేన.. ఫుల్ జోష్ తో బ‌రిలోకి దిగుతుంది. కాగ నేటి మ్యాచ్ రోహిత్ సేన సిద్దం అవుతుంద‌ని స్టార్ స్పోర్స్ తెలుగు ట్విట్ట‌ర‌లో ఒక ఫోటోను పోస్టు చేసింది. ఎన్‌బీకే 107 సినిమాలోని బాల‌య్య మాస్ లుక్ లో రోహిత్ ఫోటోను జోడించి ఉంది. హిట్ కొట్టాలంటే బాల‌య్య‌.. 6 కొట్టాలంటే హిట్‌మ్యాన్ అనే క్యాప్షన్ కూడా రాసుకువ‌చ్చింది.

అలాగే లంక పై రోహిత్ శ‌ర్మ అద‌ర‌కొట్టి.. సిరీస్ లో విక్ట‌రి సాధిస్తాడా.. అంటూ క్రికెట్ అభిమానుల‌ను ప్ర‌శ్నించింది. కాగ ఎన్‌బీకే107 ను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్.. ఈ ఫోటోను ట్వీట్ట‌ర్ లో షేర్ చేసింది. ఎన్‌బీకే107 అంటూ క్యాప్షన్ కూడా రాసుకువ‌చ్చింది. కాగ బాల‌య్య మాస్ లుక్ లో ఉన్న రోహిత్ శ‌ర్మ ఫోటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news