గ్రహణ సమయం లో రోకలిని నిలబడితే నిలబడుతుంది. లేదా పొడవైన కర్ర వంటి వాటిని నిలబడితే కూడా అవి వాటంతట అవే నిలబడతాయి. ఎటువంటి ఊతా పెట్టక్కర్లేకుండా అవి నిలబడుతూ ఉంటాయి. ఈ విషయం మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా…?ఎందుకు ఇవి నిలబడతాయి అనేది. దాని వెనుక కారణం ఇదే. మరి అదేమిటో చూద్దాం.
గ్రహణం పట్టే సమయంలో రోకలి వంటివి నిలబడుతూ ఉంటాయి. టైం అప్పట్లో చూసుకోవడానికి కుదిరేది కాదు కనుక అప్పుడు రోకలి నిలబడుతోందట గ్రహణం పెట్టినట్టే. తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడిచిందని. సైన్స్ ప్రకారం చూస్తే.. భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏదైనా వస్తువు పడకుండా నిలబడగలదు. పొడవు ఎక్కువగా ఉండి.. పీఠం వైశాల్యం తక్కువగా ఉన్నట్టయితే ఆ వస్తువు మాములుగా అయితే నిలబడలేదు.
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖ పై వచ్చినప్పుడు సూర్యచంద్రుల మధ్యన గురుత్వాకర్షణ ఒకటి అవుతుంది. దీనితో బలం వస్తువులపై పని చేసే భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పని చేస్తుందిట. దీని వలనే రోకలి నిలబడుతుంది. పళ్లెంలో నీళ్లు పోసి రోకలి నిలబెట్టినా రోలు లో అయినా సరే రోకలిని నిలబెట్టినా నిలబడుతుంది.