మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గెలుపు కోసం టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీయే 2024 ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన కామెంట్స్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు షకీల్. మునుగోడు ఉప ఎన్నికలలో బిజెపి పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని అన్నారు షకీల్. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్ర చేస్తుందని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో బిజెపి నేతలు తమ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.