కరోనా వైరస్ ని కట్టడి చేయటానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం జరిగింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. పరిశ్రమలు అన్నీ మూతపడటంతో ఉద్యోగాలు లేక ఉపాధి లేక అదేవిధంగా జీతాలు రాక పేద మరియు మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ వల్ల దేశంలో ధనవంతులు బాగానే ఉన్నా గానీ ఏ రోజుకు ఆ రోజు బతికే సామాన్యుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఇటువంటి టైములో వాళ్లని ఆదుకోవడం కోసం రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు అదేవిధంగా పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.అందరూ మనుషులు కోసం ఆలోచిస్తున్నా ఇటువంటి టైములో అవస్థలు పడుతున్న జంతువుల కోసం ఆలోచించింది ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ పన్నెండేళ్ల కూతురు అన్యా. మనుషులు బయటకు వెళ్ళలేక వాటికి ఆహారం లేక.. ఆహారం, నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్న జంతువుల కోసం వినూత్న రీతిలో విరాళాల సేకరణ అన్యా చేపట్టింది. మూగ జీవాల బొమ్మలను గీసి వాటిని అమ్మకానికి పెట్టింది. ఒక్కో చిత్రానికి గాను వెయ్యి రూపాయల చొప్పున అమ్మడంతో కేవలం ఐదు రోజుల్లోనే 70 వేల రూపాయలు సేకరించింది.
ఇదే విషయాన్ని ఫరాఖాన్ ట్విట్టర్లో తెలియచేసింది. వీటిని వీధి జంతువులకు కూతురు ఆలోచన మేరకు ఆహారాన్ని అందించేందుకు ఉపయోగించనున్నట్లు తేలిపింది. ఇక పెద్దమనసుతో విరాళాలు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది అన్యా. దీంతో సోషల్ మీడియాలో అన్యా పై జంతు ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మనుషుల కోసమే ఆలోచిస్తున్న ఈ టైములో జంతువుల గురించి ఆలోచించి వాటికి కూడా ప్రాణం ఉందని విరాళాలు సేకరించి మనందరికీ ఆదర్శంగా అన్యా నిలిచింది అని అంటున్నారు.