విమాన సర్వీసులపై లాక్‌డౌన్ దెబ్బ‌.. మ‌ళ్లీ టేకాఫ్ అయ్యేది ఎప్పుడంటే..?

-

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ష్టకాలం న‌డుస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా వైర‌స్ దేశ‌దేశాల‌ను పాలిస్తుంది. ఈ క్ర‌మంలోనే వేలాది మందిని పొట్ట‌న ‌పెట్టుకుంటుంది. ఇలా రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు మ‌రియు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతుండ‌డంతో ప్ర‌జ‌లు అర‌చేతిలో ప్రాణాలు పెట్టుకుని బ‌త‌కాల్సి వ‌స్తుంది. మ‌రోవైపు కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు సైతం క‌రోనాను నియంత్రించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భార‌త్ కూడా ఒక‌టి.

భార‌త్‌లో నేటితో లాక్‌డౌన్ ముగుస్తుండ‌డంతో.. ప్ర‌స్తుత ప‌రిస్థితి దృష్టిలో ఉంచుకుంచి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల కోరిక మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ లాక్‌డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. మే 3 వరకు దేశ పౌరులు అందరూ లాక్ డౌన్ కు సహకరించాలని మోదీ కోరారు. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌ల‌తో పాటు అన్ని వ్య‌వ‌స్థ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ క‌రోనాను నియంత్రించేందుకు ఇది ఒక్క‌టే ముందున్న మార్గం కావ‌డంతో లాక్‌డౌన్‌కు అంద‌రూ త‌ల వంచాల్సి వ‌స్తుంది.

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇక తాజాగా విమానాల రాకపోకలపై కూడా మే 3 అర్థరాత్రి వరకూ నిషేధం విధించారు. దీంతో మే 3 వరకూ దేశంలో ఏ విమానాలు టేకాఫ్ అవ్వవు అని స్ప‌ష్టంగా అర్థం అయింది. అలాగే ఈ నిషేధం దేశీయ విమాన సర్వీసులు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా వర్తించనుంది. అంటే.. విదేశాల నుంచి కూడా ఏ విమానాలు ఇండియాలో ల్యాండ్ అవ్వ‌వు మ‌రియు ఇండియా నుంచి కూడా ఏ విమానాలు విదేశాలకు టేకాఫ్ అవ్వవు అని అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news