కోర్కెలు తీర్చాలంటూ రొట్టెల పండుగ.. నెల్లూరులో నేటి నుంచి షురూ..

ఒక్కొ ప్రాంతాల్లో ఒక్క విధంగా పండుగలు జరుపుకుంటుంటారు. అయితే.. కొన్ని చోట్ల వినూత్నంగా పండుగలు నిర్వహించుకుంటారు. అయితే.. అయితే ఓ పండుగనే రొట్టెల పండుగ.. ఈ పండుగను నెల్లూరులో ఘనంగా జరుపుకుంటారు… అయితే. నెల్లూరు జిల్లాలో రొట్టెల పండుగ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 13వ తేదీ వరకు జరిగే ఈ పండుగ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కోర్కెలు తీర్చాలంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే పండుగగా దీన్ని నిర్వహిస్తారు.

Roti Festival Celebrations at Barashahid Dargah | Nellore | NTV - YouTube

ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. ముఖ్యంగా, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను గత 2015 నుంచి ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. బారా షహాద్ దర్గా వద్ద ఈ నెల 13వ తేదీ వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, బాష, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా భక్తులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీర్చాలంటూ రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయ స్థాయిలో సైతం మంచి పేరున్న విషయం తెలిసిందే.