ఆర్ ఆర్ ఆర్ లీకులు: పులితో ఫైట్ చేయనున్న ఎన్టీఆర్..

-

రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఎదురుచూడని సినిమా అభిమాని లేడు. భారతదేశ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతుంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అందరి చూపులు దీనిమీదే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించడం కూడా ఓ కారణమే. తాజాగా ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కవయ్యింది. కరోనా తర్వాత అత్యంత వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేయనున్నాడట.

కొమరంభీం గా కనిపిస్తున్న ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ అద్భుతంగా వచ్చిందట. ప్రస్తుతం ఈ ఫైట్ సీన్ తాలూకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి కూడా. ఐతే ఈ లీకులు సినిమాపై మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. కాకపోతే సినిమా నిర్మాతలకి ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రత్యేకమైన రోజున ప్లాన్ చేసి చెబుదామనుకున్న విషయాలు ఇలా లీకవుతూ ఉంటే ఆమాత్రం దిగులు సహజం. మరి ఇకనైనా ఇలాంటి లీకులు బయటకి రాకుండా చూసుకుంటారేమో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news