“ఆర్ఆర్ఆర్” ఉగాది కానుకగా టైటిల్.. మోషన్ పోస్టర్

-

కరోనా వైరస్ విజృంభనతో తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అన్ని రకాల సినిమా షూటింగ్‌లు కూడా బంద్ అయ్యాయి. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ మాత్రం రేపు ఉగాది సందర్భంగా అభిమానులకు ఓ కానుక ఇవ్వనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేయనుంది. ఈ మేరకు చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశాడు.

ఇంటి వద్దే ఉండండి.. సురక్షితంగా ఉండండి అని రాజమౌళి ప్రజలకు సూచించాడు. ఆన్‌లైన్‌లో చూసి థ్రిల్ అవ్వండి అని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పటా చేయవద్దని ఆయన కోరారు. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. కీరవాణి సంగీతం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

కాగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా బంద్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news