నెలకు రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. చేతికి రూ.25 లక్షలు.. అదిరిపోయే స్కీమ్…

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ప్రజల అవసరాల దృష్ట్యా సరికొత్త పథకాలను అందిస్తుంది.. అందులోను ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి..ఆడ పిల్లల పెళ్లికి లేదా వారి పై చదువుకు ఉపయోగపడేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు. రిస్క్‌ తక్కువ ఉండడం, నెలవారీగా కొంత మొత్తంలోనే పెట్టుబడి పెట్టే అవకాశం ఉండడంతో చాలా మంది ఈ పథకానికి మొగ్గుచూపుతున్నారు.. రోజు రోజుకు ఈ స్కీమ్ కు డిమాండ్ పెరుగుతుంది..

ఈ పథకంలో ఆడబిడ్డ 14 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఆ అకౌంట్ హోల్డర్‌కు 18 ఏళ్ల వయసు వచ్చే సరికి మెచ్యూరిటీ అమౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక 21 ఏళ్లు వచ్చే సరికి మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో మంచి పథకాల్లో ఇది కూడా ఒకటి..

ప్రస్తుతం ఈ స్కీమ్ లో 8 శాతం పెట్టుబడి వస్తుంది..ఇకపోతే ప్రతీ త్రైమాసికానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. ఇక ఈ పథకం గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు ఈ అవకాశం ఉంటుంది. ఇక పాప పుట్టిన వెంటనే ఈ సుకన్య సమృద్ధిలో చేరితే 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆమెకు అప్పటికి 14 ఏళ్లు నిండుతాయి. ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం మీ ఇష్టం ఉన్నంత కట్టుకోవచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకులో రూ. 205 తో అకౌంట్‌ను తెరవచ్చు..

ఇకపోతే ఈ పథకంలో డబ్బులను రూ.5 వేలు ఇన్వెస్ట్ మెచ్యూరిటీ సమయానికి రూ.25 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు..ఉదాహరణ మీరు రూ. 60 వేలు కట్టారనుకోండి మొత్తం 15 ఏళ్ల లెక్కన మీరు రూ. 9 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఏటా 15 ఏళ్ల వరకు కడితే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి చేతికి మొత్తం రూ. 25 లక్షలు అందుతాయి. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వడ్డీ రేటు ఆధారంగానే, ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే అమౌంట్ కూడా పెరుగుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news