అధికారుల బదిలీపై తెలంగాణ బీఎస్పీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

-

ఎమ్మెల్సీ తాత మధు నిన్న బీఆర్ఎస్ దొరల అసలు రూపాన్ని బయట పెట్టారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇలా అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలను వంచిస్తోందని, అందుకే ఇది గమనించి నిన్ననే కేంద్ర ఎలక్షన్ కమిషన్ గతంలో ఎక్కడ, ఎన్నడూ లేని విధంగా 19 మంది ఉన్నతాధికారులను ట్రాన్స్ఫర్ చేసిందని వెల్లడించారు. ఇది ఆయా అధికారులకే కాక బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటిదన్నారు. అధికారం తమ గడీలో బానిసగా పడి ఉండాలని ఈ దొరల ప్రభుత్వం అనుకుంటుందన్నారు. అధికారం పేద ప్రజల జీవితాన్ని మార్చే ఆయుధం కావాలనుకుంటున్నది బహుజన సమాజ్ పార్టీ. అందుకే ఈ ఎన్నికల్లో దొరల రాజ్యాన్ని కూలగొట్టి బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.

కొత్తగూడెంలో నిన్న బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రవీణ్​కుమార్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెల రోజులుగా సీఎం కేసీఆర్​జాడలేకుండా పోయారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని చిత్తుగా ఓడిస్తేనే తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కాళేశ్వరానికి ఫండ్స్​ఇచ్చిన కేసీఆర్​సర్కార్..​ సీతారామ ప్రాజెక్ట్​కు నామమాత్రపు నిధులిస్తుండటం దారుణమన్నారు. తన ఫాంహౌస్ లోకి నీళ్లు తెచ్చుకునేందుకు దాదాపు రూ. 2 వేల కోట్లతో రాత్రికి రాత్రే కొండపోచమ్మ సాగర్​కు నిధులు శాంక్షన్లు ఇప్పించుకున్నారని విమర్శించారు. రూ. 1400 కోట్లతో కట్టిన సెక్రటేరియెట్​లో కేసీఆర్​ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో కూర్చోలేదన్నారు. నిజాయతీగా పనిచేసే ఆఫీసర్లను లూప్​ లైన్​లో వేస్తూ, తన డబ్బుల పంపిణీకి సహకరించే ఆఫీసర్లతో ఎన్నికల్లో గెలుపొందాలని కేసీఆర్​చూస్తున్నారని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version