Raviteja: మాస్‌ మహారాజా దూకుడు.. 70వ సినిమాకి ముహూర్తం!

-

Raviteja: మాస్ మహారాజా రవితేజ దూకుడు మాములుగా లేదండీ బాబు.. ఆయ‌న స్పీడ్ చూస్తుంటే.. నోరెళ్ల బెట్టుకోవాల్సిందే.. యువ హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా.. ఏక‌ధాటిగా గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నాడు. అదే స్పీడులో కంప్లీట్ చేస్తూ సుకెళ్లిపోతున్నాడు.

ఓ వైపు.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా సెట్స్‌పై ఉంది. ఆ సినిమాను పూర్తి చేయ‌క‌ముందే.. మరో వైపు శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమాను చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ ప్రాజెక్టు అలాగే ఉండ‌గానే.. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో ‘ధ‌మాకా’మూవీ ప్ర‌క‌టించి అంద‌రికీ దిమాకుల‌కు షాకిచ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.

రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ రేపు(ఆదివారం)ఉద‌యం 10.08 గంటలకు రివీల్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. దర్శక నిర్మాతలతో పాటు మిగతా విషయాలను రేపు ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news