జగన్ సర్కార్ కు షాక్… ఈనెల 6న ఆర్టీసీ సమ్మె

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఉద్యోగులు, ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీని వ్యతిరేఖిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఈనెల 7 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉద్యోగులను చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అయతే ఈరోజు మంత్రుల కమిటీతో.. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది.

ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికులు కూడా తమ డిమాండ్ల పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తడి చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 6 నుంచి సమ్మెలోకి వెళ్తామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈమేరకు 45 సమస్యలతో కూడిన మెమోరాండాన్ని ఆర్టీసీ ఎండీకి కార్మిక సంఘాల నేతలు అందించారు. మెమోరాండం ఇచ్చిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో ఎన్ఎంయూ, ఈయూ, ఎస్ డబ్య్లూ ఎఫ్, కార్మిక పరిషత్ ఉన్నాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు అధికారులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news