కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సీరియస్ అయ్యారు. మహాభారతంలోని శ్లోకాలతో బడ్జెట్ ను ప్రారంభించిన నిర్మల సీతారామన్… పచ్చి అబద్ధాలు చెప్పారు అని మండిపడ్డారు. దేశ ప్రజలను నయవంచన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యంత దారుణమైన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిప్పులు చెరిగారు. బడ్జెట్ పూర్తిగా గోల్ మాల్ అని..అందరికీ గుండుసున్నా పెట్టారని కేంద్రం పై కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎస్టీ లకు కేంద్రం 12,800 కోట్లు పెట్టిందని.. ఒక్క తెలంగాణలో ఎస్సీ ఎస్టీ లకు 33,611 కోట్లు పెట్టామని గుర్తు చేశారు సిఎం కెసిఆర్. రైతులకు క్షమాపణ చెప్పారు గానీ బడ్జెట్లో వాళ్ల ప్రస్తావన లేదని మండిపడ్డారు. యూరియా మీద సబ్సిడీ 12708 కోట్లు తగ్గించారని.. ఎరువుల మీద 3 వేల కోట్లకు పైగా సబ్సిడీ తగ్గించారని అగ్రహించారు కెసిఆర్.