రష్యా బంగారంపై నిషేధం.. ఎందుకంటే?

-

రష్యా బంగారంపై అమెరికా, యూకే, కెనడా, జపాన్ దేశాలు నిషేధం విధించనున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్‌తో యుద్ధం చేయకుండా ఉండాలంటే.. రష్యాకు నిధులు లేకుండా చేయాలి.. దీంతో ఈ దేశాలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ వనరులపై ప్రభావం చూపనుందని యూకే ప్రభుత్వం వెల్లడించింది. అయితే 2021లో రష్యా 15.4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. యుద్ధం ప్రారంభం కావడంతో రష్యాలోని సంపన్నులు బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచారు.

బంగారం
బంగారం

జర్మనీలో జీ-7 భేటీ జరిగిన సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, రష్యా బంగారాన్ని నిషేధించిన జాబితాలో జీ-7 సభ్యదేశాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా చేరాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. బంగారం ద్వారానే రష్యాకు ఆదాయం సమకూరుతోందని, ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని విరమించుకోవాలంటే.. రష్యా నుంచి బంగారం దిగుమతులను నిషేధించాలని ఆయన అన్నారు. దీనికి జీ-7 దేశాలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. కాగా, బైడెన్‌ తీసుకున్న నిర్ణయంపై బ్రిటన్ ప్రధాని బోరిన్ జాన్సన్ మద్దతు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news