తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల తేదీ ఖరారు

-

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల పరీక్షా ఫలితాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

విద్యార్థులు-పరీక్షలు
విద్యార్థులు-పరీక్షలు

ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ మొత్తంగా 9,07,393 మంది ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్, జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఎన్నో రోజులు అయ్యాయి. ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఫలితాల తేదీ విడుదల కావడంతో విద్యార్థుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news