రష్యా- ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ పరిణామాలపై ఇండియా తటస్థంగా వ్యవహరిస్తోంది. రష్యా- ఉక్రెయిన్న యుద్ధ పరిణామాలపై రేపు పార్లమెంట్ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన చేయనున్నారు. భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘ ఆపరేషన్ గంగా’పై ప్రకటన చేయనున్నరు. ఇదే విధంగా భారత్ వ్యవహరిస్తున్నవిదేశాంగ విధానంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు ఆదేశంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్ పై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ రాజ్యసభలో రష్యా ఉక్రెయిన్ వివాదం, యుద్ధ ప్రభావిత ప్రాంతం నుంచి తిరిగి వచ్చిన విద్యార్ధులు భవిష్యత్తుపై చర్చించాలని తీర్మాణం ఇచ్చారు. ఇదే విధంగా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఇదే అంశంపై వాయిదా తీర్మాణాన్ని ఇచ్చారు. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశాల్లో కూడా ఉక్రెయన్ సంక్షోభం, విద్యార్థుల భవిష్యత్ గురించి చర్చిస్తామని కాంగ్రెస్ ఎంపీలు వెల్లడించారు.