రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. కీవ్, ఖార్కీవ్ నగరాలపై రాకేట్లతో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. మరియోపోల్ నగరాన్ని దాదాపు హస్తగతం చేసుకుంది.
ఇదిలా ఉంటే మరోసారి యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది రష్యా . 24 గంటల్లో రెండోసారి కాల్పుల విరామాన్ని ప్రటకటించింది. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులను తరలించడానికి మానవ కారిడార్ ను ఏర్పాటు చేయడానికి రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు సార్లు కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. తాజాగా ఈరోజు మరోసారి కాల్పుల విరామం ప్రకటించింది. నాలుగు నగరాల్లో కొన్ని గంటల మేర కాల్పులను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కీవ్, మరియోపోల్, సుమీ, చెర్నిహివ్ నగరాల్లో కాల్పుల విరామాన్ని ప్రకటించింది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి విదేశీయుల తరలింపుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే తూర్పు ప్రాంత నగరం అయిన సుమీలో దాదాపుగా 700 మంది భారతీయ విద్యార్థులను తరలించేందుకు మార్గం ఏర్పడింది.