తెలంగాణ బడ్జెట్ ను నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశ పెట్టారు. ఇక ఈ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన అనంతరం.. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కూడా మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. మంత్రి హరీష్ రావు చెప్పిన విధంగా.. రాష్ట్ర అప్పుల పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతోంది.
ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో సమీకరించుకుంటామని ప్రతిపాదించిన రుణాలతో కలిపి మొత్తం అప్పులు రూ.3.29 లక్షల కోట్లకు చేరనున్నాయి. 2021-22 ఏడాదికి గాను సవరించిన బడ్జెట్ అంచనాలు. రాష్ట్ర అప్పులు రూ.285120 కోట్లు. తాజా బడ్జెట్ లో కొత్తగా రూ.59 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో పాత రుణాలకు సంబంధించి చెల్లింపులు పోగా.. రూ.45 వేల కోట్లు అదనంగా జతకానున్నాయి. దీంతో రాష్ట్ర అప్పుల పద్దు రూ.3 లక్షల కోట్లు దాటుతోంది.