ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై రష్యా హామీ.. సహకరిస్తామని వెల్లడి

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ‘ఆపరేషన్ గంగ’ ద్వారా భారతీయ విద్యార్థులను పోలెండ్, రోమేనియా, స్లోవేకియా, హంగరీ, మాల్టోవా దేశాల నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ భాగంలో ఉన్న భారతీయులను తరలించడం చాలా సులభం అయింది. యుద్ధం జరుగుతున్న తూర్పు ప్రాంతాల్లో ముఖ్యంగా ఖర్కీవ్, సుమీ ఏరియాల్లో ఉన్న భారతీయులను తరలించడం చాలా కష్టంతో కూడుకున్నది.

ఇదిలా ఉంటే నిన్న ఖర్కీవ్ లో రష్యా క్షిపణి దాడిలో కర్ణాటకకు చెందిన నవీన్ శంకరప్ప మరణించాడు. ఈవిషయాన్ని భారత దేశం రష్యా దృషికి తీసుకెళ్లింది. ఈఘటనపై రష్యా విచారాన్ని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే భారతీయ విదేశాంగ శాఖ ఉక్రెయిన్ లోని భారతీయును రష్యా ద్వారా తరలించేందుకు అనుమతించాలని ఆదేశ విదేశాంగ శాఖను కోరింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల మధ్య తూర్పు వైపు ఉన్నవారిని రష్యా నుంచి భారత్ కు తరలించే ప్రయత్నం చేస్తోంది.

ఖార్కివ్ మరియు తూర్పు ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన భారతీయుల కోసం మేము భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని.. రష్యా భూభాగం ద్వారా అక్కడ చిక్కుకున్న వారందరినీ అత్యవసర తరలింపు కోసం భారతదేశం యొక్క అభ్యర్థనలను స్వీకరిస్తున్నామని.. భారత్ లోని రష్యన్ రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news