ఫ్లాష్ క‌ట్ : నెల్లూరు ప్రాంతం కాకాణి రాగం ఆహా !

-

నెల్లూరు నుంచి తిర్ప‌తికి పోతాండాను
అప్ప‌టికే కొంద‌రు రెడ్లు తెలుసు
అప్ప‌టికే కొంద‌రు నాయ‌కులూ తెలుసు
ఆ విధంగా తెలిసిన విష‌యాల స్మ‌ర‌ణ‌లో నేను
మ‌రియు నాతో ఇంకొంద‌రు ఆవేళ
అన‌గా కొన్నేళ్ల కింద‌ట అని అర్థం !
ఆనం సోద‌రుల హ‌వా న‌డుస్తున్న కాలంలో అని కూడా అర్థం !
మార్ద‌వం అయిన అర్థం అని కూడా చెప్ప‌గ‌ల‌ను.

న‌వ్వినా ఏడ్చినా క‌న్నీళ్లే వ‌స్తాయి..చాలా రోజుల కింద‌ట నెల్లూరుకు పోయిన‌ప్పుడు ఎదురుగా ఓ పెద్ద క‌టౌట్ లాంటి మ‌నిషిని చూశాను. మ‌నిషిని నిల‌బెట్టిన మ‌నుషుల‌నూ చూశాను. ఆ విధంగా నెల్లూరులో ఆనం సోద‌రుల ఫ్లెక్సీలు అగుపించాయి లేదా తార‌సిల్లాయి. అప్ప‌టికీ అనిల్ అనే కౌన్సిల‌ర్ ఎవ్వ‌రో కూడా నాకు తెలియ‌దు. ఇప్ప‌టి అనిల్ మాజీ మంత్రి అప్ప‌టి అనిల్ ఏమ‌న్న‌ది కూడా తెలియ‌దు.. ఆయ‌న నేతృత్వంలోనే ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం ప‌నులు జ‌రగ‌నున్నాయ‌నీ తెలియ‌దు.. అంతేకాదు చాలా విష‌యాలు తెలియ‌దు.

కానీ నెల్లూరు పెద్దారెడ్డిని ఢీ కొన‌డం క‌ష్టం అని మాత్రం. నెల్లూరు రెడ్లు వైఎస్సార్ మాట విన‌ర‌ని కూడా తెలుసు. నెల్లూరు రెడ్లు మ‌రియు కృష్ణా, గుంటూరుకు చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత‌లు బాగా వ్యాపారం చేయ‌గ‌ల‌ర‌ని మాత్ర‌మే తెలుసు. ఆ విధంగా కొద్దిగా కాదు చాలా ఎక్కువ‌గానే హైద్రాబాద్ లో స్థిర‌ప‌డిపోయిన నెల్లూరు రెడ్లు కూడా తెలుసు. ఆ విధంగా నెల్లూరు నుంచి పోయి త‌మిళ నాట స్థిర‌ప‌డిపోయిన రెడ్లు కూడా కొద్దిగా తెలుసు. అదేవిధంగా ఇదే స‌మ‌యాన భాగ్య‌న‌గ‌రి (ఇలా రాస్తే బీజేపీ సంతోషిస్తుంది) లో స్థిర‌ప‌డిపోయిన గుంటూరు మెస్ నిర్వాహ‌కులు కూడా తెలుసు.. అదేవిధంగా మిగ‌తా క‌మ్మ సామాజిక వ‌ర్గ ప్ర‌తినిధులు మ‌రియు నెల్లూరు రెడ్లు అప్పుడ‌ప్పుడూ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ లో తార‌స‌ప‌డిన రోజులు కూడా గుర్తు. ఇంకా గుర్తు. ఎప్ప‌టికీ చెర‌గ‌ని గుర్తు లేదా జ్ఞాప‌కం కూడా !

చివ‌రికి మిగిలేది.. ఏడ్వ‌కు న‌వ్వ‌కు.. న‌వ్వి ఏడ్చి ఇబ్బందులు పెట్ట‌కు! ఆహా! లైఫ్ లో ఈ పాటి ఆహా ఉండాల‌ని అల్లు వారింటి అబ్బాయితో త్రివిక్ర‌మ్ చెప్పి ఉంచాడు. అదే ఇప్పుడు కూడా నెల్లూరు కూడ‌ళ్ల‌లో కూసింత ఎక్కువ‌గానే వినిపిస్తాండాయి. అవే ఇప్పుడు కొత్త స‌మీక‌ర‌ణ‌ల‌కు కొత్త కూత‌ల‌కు మ‌రికొన్ని రాత‌ల‌కు స‌హ‌కరిస్తాండాయి. మీడియా అంటేనే అస‌హ‌నంతో ప‌డి చ‌చ్చిపోతున్న నాయ‌కుల‌కు నెల్లూరులోనే కాదు ఆంధ్రాలోనే లోటు లేదు. పాపం వాళ్ల‌ను ఏమీ అడ‌గ‌వ‌ద్దు. వారిని అస‌హ‌నంకు గురి చేయ‌వ‌ద్దు. ఆ విధంగా వెన‌క్కు త‌గ్గండి లేదా ముందుకు వెళ్లండి కానీ జాగ్ర‌త్త‌! ఇదే ఇవాళ్టి సూత్రం. అయినా ఏం చెప్పినా వింటారా ? మంచి చెబితే పాటిస్తారా ? స‌హ‌న రాగం సంగీతంలో ఉంటుంది ఇక్కడ అస‌హ‌న రాగం విన‌వ‌స్తోంది. పొలిటిక‌ల్ గీతాలు మ‌రియు ప్ర‌భోదాలు విభిన్నంగా ఉండాలి. అంటే కాస్త బాకాకు ద‌గ్గ‌ర‌గా కాస్త కాకా కు మ‌రియు కాకాణికి ద‌గ్గ‌ర‌గా ఉంటే మేలు. అదే ఇవాళ్టి ప‌రిణామాలు ఉద్బోధ చేస్తున్నాయి. ఆహా ! రండి నెల్లూరుకు పోదాం !

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

     

Read more RELATED
Recommended to you

Latest news