త్వరలో ఇండియాకు, రష్యా ఎస్ -400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం…

-

భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. భారత్ వైపు కన్నేయాలంటే శత్రు దేశాలు ఒకరికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టంను మరింతగా పటిష్టం చేసేందకు రష్యా నుంచి ఎస్ -400 ట్రయాంప్ క్షిపణి రక్షణ వ్యవస్థ రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రష్యాతో సంప్రదింపులు పూర్తయ్యాయి. వచ్చే నెల డిసెంబర్ లో ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా రష్యా అధ్యక్షడు వ్లాడిమిర్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. ఈ సమయంలోనే ఎస్ -400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను భారత్ కు అందచేయాలని రష్యా భావిస్తోంది.

ఇప్పటికే చైనా, టర్కీలు రష్యా నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కొనుగోలు చేశాయి. ఈ రెండు దేశాల తర్వాత ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయనున్న మూడో  దేశంగా భారత్ నిలువనుంది. అతి త్వరలోనే భారత్ కు ఎస్ 400 సిస్టంను అందించనున్నామని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ (FSMTC) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ స్పుత్నిక్‌తో అన్నారు. భారత్ తో పాటు మరో 7 దేశాలకు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను అందించేందుకు చర్చలు జరుగుతున్నాయని రష్యా తెలిపింది. శత్రువు నుంచి వచ్చే క్షిపణుల్ని 400 కిలోమీటర్ల ముందే పసిగట్టి అత్యంత ఖచ్చితత్వంతో నేలకూల్చేసామర్థ్యం ఎస్ -400 సొంతం. సర్పెస్ టూ ఎయిర్ మిస్సైళ్లను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూల్చే సామర్థ్యం ఎస్ -400 కు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news