వెన్నుపోటు రాజకీయాలకు, నమ్మక ద్రోహాలకు చంద్రబాబే కేరాఫ్ అన్న టాక్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. చంద్రబాబును నమ్మి ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు లేకుండా జీవితాలను బలి చేసుకున్నారు. ఈ లిస్టులోకి ఇప్పుడు మరో పొలిటికల్ కుటుంబం చేరిపోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన డీకే ఫ్యామిలీ రాజకీయ జీవితానికి దాదాపు శుభం కార్డు పడిపోయింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన దివంగత డీకే. ఆదికేశవులు నాయుడు 2004లో చిత్తూరు ఎంపీగా టీడీపీ నుంచి విజయం సాధించారు. చంద్రబాబు మీకోసం యాత్రం ఖర్చంతా భరించారు.
ఆ తర్వాత బాబు ఆదికేశవుల నాయుడును పక్కన పెట్టడంతో ఆయన వైఎస్ ప్రోత్సాహంతో కాంగ్రెస్‌లో చేరి టీటీడీ చైర్మన్ అయ్యారు. ఆయర మరణాంతరం ఆయన కుటుంబంపై ఉన్న సానుభూతి క్యాష్ చేసుకోవడంతో పాటు ఆ కుటుంబం నుంచి భారీగా లబ్ధి పొందిన క్రమంలోనే బాబు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారన్న టాక్ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన డీకే ఫ్యామిలీకి చంద్రబాబు చిత్తూరు అసెంబ్లీ సీటు ఇచ్చారు. సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
గత ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు ఆ కుటుంబాన్ని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారు. సత్యప్రభ సిట్టింగ్ సీటు చిత్తూరును కాదని.. ఆమె ఓడిపోయే రాజంపేట పార్లమెంటు సీటుకు బలవంతంగా పంపారు. ఆమెకు అక్కడ పోటీ చేయడం ఇష్టం లేకపోయినా బాబు కోరిక మేరకు పోటీ చేసి భారీగా ఖర్చు పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి డీకే ఫ్యామిలీని బాబు పట్టించుకోవడమే మానేశారు. ఆ కుటుంబంతో అవసరం లేదనుకున్నారో ? ఏమో గాని సైడ్ చేసేశారు.
బాబు తీరుతో విసిగిపోయిన డీకే తనయుడు శ్రీనివాస్ ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి తిరుపతి వచ్చిన జగన్‌ను కలిశారు. ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం కూడా జరిగింది. డీకే ఫ్యామిలీ ఇంత ఇబ్బందుల్లో ఉండగానే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ ( 70) మృతి చెందారు. కొద్ది రోజుల క్రిందటే ఆమెకు కరోనా సోకింది. బెంగళూరులో ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏదేమైనా చంద్రబాబు చివర్లో ఆమెను పట్టించుకోకుండా… ఉపాధ్యక్షరాలు పదవితో సరిపెట్టేశారు. రాజకీయంగా చివర్లో ఆమె మనోవేదనతోనే ఉన్నారు.