కుందనపు బొమ్మ కుళుకులు..పట్టు చీరలో సదా సొగసులు చూడతరమా..

-

‘జయం’ సినిమాలో ‘వెళ్లవయ్యా వెళ్లు’ అనే డైలాగ్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ సదా. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ గా ఉన్న ఈమె తొలి సినిమా ‘జయం’తోనే చక్కటి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది ఈ సీనియర్ హీరోయిన్.

మల్లెమాల ప్రొడక్షన్ లో వస్తోన్న డ్యాన్స్ షో ‘ఢీ ’ తో ఇంకా పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలోనూ ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సదా..పట్టు చీరలో దిగిన ఫొటోలు షేర్ చేసింది.

సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో సదా..కుందనపు బొమ్మలా కనబడుతోంది. ఎరుపు రంగు పట్టు చీరలో చిరునవ్వు చిందిస్తు రకరకాల ఫోజులిచ్చిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘లుకింగ్ గుడ్, కూల్ స్మైల్, లవ్ యూ, సూపర్’ అని కామెంట్స్ చేస్తు్న్నారు.

https://www.instagram.com/p/CddeW5qhHzI/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news