నిండు కుండలా నాగార్జునసాగర్

-

ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ఆదివారం సాయంత్రానికి 262 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని అధిగమించింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను ఎగువ నుంచి జలాశయంలోకి 73వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రస్తుతం 572.20 అడుగులకు చేరింది. శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. జూరాల నుంచి 70 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 17వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.  ఆలమట్టికి ఎగువ నుంచి వస్తోన్న 1.30 లక్షల క్యూసెక్కుల వరదని అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. నీటి ప్రవాహం ఎగువ నుంచి ఇదే స్థాయిలో వస్తే మరో రెండు రోజుల్లో నాగార్జున సాగర్ పూర్తిగా నిండనుంది. సాగర్ దిగువ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news