మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరంతేజ్ తన నటనతో సుప్రీం హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన ఇటీవల తన తమ్ముడు వైష్ణవ తేజ్ , కేతిక శర్మ కాంబినేషన్లో వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండవ తేదీన విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. తన తమ్ముడు మీద ఉన్న ప్రేమను కురిపించాడు. అంతేకాదు తనకు యాక్సిడెంట్ జరిగిన నాటి రోజులను కూడా గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.ఇక సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. నేను మళ్ళీ ఇలా రావడం నా అదృష్టం.. మళ్ళీ వస్తాను అని అనుకోలేదు.. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఆక్సిడెంట్ అయినప్పుడు నా ఫ్యామిలీకి సుమా అక్క ఎంతో హెల్ప్ చేసింది. ఏరా వైష్ణవ్.. కేతికతో అంత క్లోజ్ ఆ నువ్వు.. నాకు కాస్త షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చింది. గిరీషయ్యా కు ఆల్ ది బెస్ట్.. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి ..దేవి గారు మంచి పాటల అందించినందుకు చాలా థాంక్స్. టైటిల్ ట్రాక్ నాకు చాలా ఇష్టం . శ్యామ్ గారిని నేను చాలా ఇబ్బంది పెట్టాను. మా ప్రసాద్ గారు నాకు మంచి చిత్రాన్ని ఇచ్చారు.. ఇక మా నిర్మాతలు మాకు ఫ్యామిలీ వంటి వారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలిపారు.
ఇక 2021 లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నాకు ఆక్సిడెంట్ అయింది. నాకు అసలే మెమొరీ లాస్.. ఒట్టేసి చెబుతున్న .. నేనేమీ 90 వెయ్యలేదు.. నాకు తాగడం అలవాటు లేదు.. కానీ విధి వికటించడంతో ఆక్సిడెంట్ జరిగింది.. కానీ దేవుడి దయ, అభిమానుల ఆశీస్సులు , కుటుంబం యొక్క ప్రేమానురాగాలే నన్ను మళ్ళీ బ్రతికించాయి అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక అందరూ బైక్స్ నడుపుతుంటారు కదా! హెల్మెట్ పెట్టుకోండి.. ఆ హెల్మెట్ వల్లే నేను బ్రతికి ఉన్నాను.. చేతులెత్తి మరీ జోడిస్తున్నాను.. హెల్మెట్ ధరించండి.. ఇసుక ఉంటే నేనేం చేస్తాను.. మన విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.. అందరూ హెల్మెట్ ధరించండి అంటూ బైకర్స్ కి తన మాటగా చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్.