చంద్రబాబు రాజీనామా చేసి మళ్లీ గెలవాలి: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా నారా లోకేష్, చంద్రబాబుపై మంత్రి రోజా సవాల్ విసిరారు. నారా లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్‌లో ఉత్తర కుమారుడు గుర్తొస్తున్నాడని ఆరోపించారు. సీఎం జగన్ కాలి గోటికి కూడా నారా లోకేష్ సరిపోడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి రోజా
మంత్రి రోజా

వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. సీఎం జగన్‌ను విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ప్రచారం చేశాకే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందన్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేస్తే వారిపై కేసులు పెట్టకుండా సన్మానించాలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు 33 ఏళ్లలో కుప్పంలో ఎన్నిసార్లు పర్యటించారో.. అంతకంటే ఎక్కువగా గత మూడేళ్లలో సీఎం జగన్ పర్యటించారు. దమ్ముంటే చంద్రబాబు రాజీనామా చేసి కుప్పంలో పోటీ చేయాలని రోజా సవాల్ విసిరారు.