పుష్ప 2 లో నెగిటివ్ పాత్రలో స్టార్ హీరోయిన్ ?

-

అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా చిత్రీకరణ చాలా వేగంగా జరుగుతోంది. మొదటి షెడ్యూల్ వైజాగ్ లో నిర్వహించగా అక్కడ చిత్రీకరణలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే పాల్గొన్నారు.

అల్లు అర్జున్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు సుకుమార్ ఆ తర్వాత హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ మరియు శివారు ప్రాంతంలో చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమాలో కీలకపాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రష్మిక, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ సీన్లలో సాయి పల్లవి నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సాయి పల్లవి 10 రోజులు కాల్ షీట్స్ ఇచ్చారట.

Read more RELATED
Recommended to you

Latest news