సైనా బయోపిక్ రిలీజ్ ఈ నెలలోనే..

-

భారతదేశ వెండితెరపై బయోపిక్ లకి డిమాండ్ చాలా ఎక్కువ. క్రీడా వ్యక్తుల జీవితకథలైతే మరీ ఆసక్తిగా చూస్తారు. అందుకే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా మంది జీవితాలు దర్శనమిచ్చాయి. ధోనీ, మేరీ కోమ్, భాగ్ మిల్కా భాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తాజాగా సైనా నెహ్వాల్ జీవితం తెరమీదకి రానుంది. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం తెరమీదకి వస్తుందని, అందులో శ్రద్ధా కపూర్ నటిస్తుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ శ్రద్ధాకపూర్ ఈ సినిమా నుండి తప్పుకుంది.

ఆ తర్వాత పరిణీతి చోప్రా ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఎడిటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంది. ఈ నెల 26వ తేదీన రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్తర్ ని రిలీజ్ చేసారు. షటిల్ కాక్ ఆకారంలో సైనా టైటిల్ అందంగా ఉంది. ఆ కాక్ ని సర్వీస్ చేస్తున్నట్లుగా చేతిని చూపించారు. ఆ మణికట్టుకి భారత పతాకం బ్యాండ్ ఉంది. ఫస్ట్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి. టీ సిరీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాని అమోల్ గుప్తే దర్శకత్వం వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news