జగన్ బెయిల్ రద్దు పై బీజేపీ నేతలకు ముందే తెలుసా.. సజ్జల సంచలన కామెంట్స్

Join Our Community
follow manalokam on social media

జగన్ బెయిల్ రద్దు బీజేపీ నేతల వ్యాఖ్యల పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బైలు రద్దు అవుతుందని బీజేపీ నేతలు ముందే ఎలా చెప్తారు..న్యాయ వ్యవస్థ బీజేపీ చేతుల్లో ఉంటుందా అని ఫైర్ అయ్యారు.  ప్రస్తుతం బెయిల్ పై ఉన్న జగన్ ఏ క్షణమైనా జైలుకెళ్లొచ్చు.. జగన్ బెయిల్ ఏ క్షణమైనా రద్దయ్యే అవకాశం ఉందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సజ్జల.బీజేపీ కేంద్రంలో ఉందని ఏది మాట్లాడిన ప్రజలు వింటారని అనుకుంటున్నారా. వ్యవస్థలపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని అనుకుంటున్నారన్నారు సజ్జల. బీజేపీ,జనసేన,టీడీపీ లోపాయి కారికంగా పని చేస్తున్నాయన్నారు.


ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించిన సజ్జల రామకృష్ణ రెడ్డి. చంద్రబాబు వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారన్నారు.టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లిన వారితో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారు.వ్యవస్థలోని కొందరు వ్యక్తులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు అని ఫైర్ అయ్యారు.ఇక తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ఇతర ప్రాంతాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుని ప్రచారం చేస్తోందనిచేతగాని వాళ్ళు, అసమర్థులు చేసే పని వీళ్ళు చేస్తున్నారన్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. పవన్ మాటలు సినిమా సినిమాకు మారే డైలాగుల్లా ఉన్నాయన్నారు. చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో చనిపోయారని టీడీపీ పగలు ఒకరితో, రాత్రి ఇంకొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పటానికి ఏమీ లేక టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు విష ప్రచారం మొదలు పెట్టాయన్నారు.

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...