TSRTC ‘రాఖీ’ లక్కీ డ్రా విజేతలకు నగదు బహుమతులు

-

రక్షాబంధన్ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి ఈరోజు నగదు పురస్కారాలు అందించినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఫస్ట్ ప్రైజ్ రూ.25 వేలు, సెకండ్ రూ.15 వేలు, థర్డ్ రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.50 లక్షల నగదు బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. ఆ రోజున సంస్థకు రికార్డు స్థాయిలో రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు.

TSRTC Cash Prizes for Rakhi Poornami Lucky Deep Winners..-Namasthe Telangana

అయితే, కార్యక్రమానికి రీజియన్ల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. ఈ సందర్భంగా లక్కీడ్రా విజేతలు ఆర్టీసీతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ దైనందిత జీవితంలో ఆర్టీసీ బస్సు ఓ భాగమైందని, ప్రతి రోజు లక్షలాది మందిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news